సుప్రీం కోర్టులో కవిత పిటిషన్..
ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు. ఫోన్ సీజ్ వ్యవహారాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు కవిత. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై కవిత పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్ 60 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
గురవారం విచారణ నుంచి కూడా మినహాయింపు కోరారు కవిత. అయితే ఈ కేసులో కవితకు కోర్టు నుంచి చుక్కెదురైంది. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేసింది. దీంతో గురువారం ఈడీ విచారణకు కవిత హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢల్లీికి వెళ్లారు.