ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత గుర్తింపు తెచుకున్నారు నభా నటేష్. దానికి ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నారు నభా నటేష్.
వరుసగా సినిమాలు చేయడం.. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో తన ఫొటోలతో ఫాలోవర్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఎప్పటి కపుడు కొత్త కొత్త ఫ్యాషన్ వేర్స్ ధరిస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోలను నభా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ ఉంటోంది నభా. ఈ ఫోటోలు చూసిన తర్వాత బాపురే ఏం భామరే అనుకోకుండా ఉండటం కష్టమే.