తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. గ్రూప్ – 1 ప్రిలిమ్స్‌ను 48 గంటల్లో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక వేళ గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేయకపోతే.. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని సంచలన ప్రకటన చేశారు. ఈ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ లో ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఏఈ ప్రశ్నాపత్రం మాత్రమే లీకైందని అధికారులు చెబుతున్నా.. ఇటీవల నిర్వహిచిన అన్ని పేపర్లు లీకయ్యాయయన్న అనుమానాలు నిరుద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయ్యిందన్న ఆందోళన నిరుద్యోగ వర్గాల్లు ఉంది. పేపర్ లీక్ కు ప్రధాన కారకుడైన ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాయడం.. అందులో అతను 103 మార్కులు సాధించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి సైతం ప్రవీణ్ 103 మార్కులు సాధించిన విషయాన్ని అంగీకరించారు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అతను 103 మార్కులు ఎలా సాధించగలిగాడని రాష్ట్రంలోని నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.