హైదరాబాద్: ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.. వికారాబాద్, సంగారెడ్డి, జిహెచ్ఎంసి ప్రాంతాల్లో వడంగండ్ల వర్షం కురుస్తోంది. నగరంలోని కోన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం దంచి కొట్టింది. అటు గచ్చిబౌలి, యూసుఫ్ గూడ, కాటేదాన్, రాజేంద్రనగర్, పంజాగుట్ట, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, కోఠి, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. దీంతో ప్రజలు వడగండ్ల వాన దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.