మృతుల కుటుంబాలకు పరిహారం
గాయపడిన వారిని ఆదుకుంటామని భరోసా
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవటంతో పాటు, పలువురు గాయపడటం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం.. మరణించిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.
దక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే సికింద్రాబాద్‌లో గురువారం రాత్రి 7 గంటల సమయంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా చేలరేగిన మంటల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో పలు దుకాణాలతో, కార్యాలయాలు ఉన్నాయి. బిల్డింగ్ మెత్తుం 8 అంతస్తుల్లో ఉండగా.. 4,5,6,7 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో మెుత్తం.. 70 మంది ఉన్నన్లు సమాచారం. మంటలు వ్యాపించటంతో అందులో ఉన్న వారు పరుగులు తీశారు.