క్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 126 రోజుల తర్వాత.. రోజువారీ కేసుల నమోదు ఎనిమిది వందలు (800) దాటటంతో.. అలర్ట్ ప్రకటించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ప్రతి రోజూ బాధితులు పెరుగుతూ ఉండటంపై.. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. వాతావరణ మార్పులు.. ఇతర వైరస్ లతో జనం ఇబ్బంది పడుతున్న సమయంలోనే.. కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే.
2023, మార్చి 17వ తేదీ శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 5 వేల 389 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య అదే స్థాయిలో ఉందని.. మరణాల రేటు అతి స్వల్పంగా ఉందని స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్ రేటు.. వ్యాప్తి రేటు జీరో పాయింట్ జీరో వన్ శాతంగానే (0.01శాతం) ఉందని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద.. ఇప్పటి వరకు 220 కోట్ల డోసులు ఇవ్వటం జరిగిందని వివరించింది. 126 రోజుల తర్వాత రోజువారీ కరోనా కేసుల నమోదు 800కు చేరుకోవటం ఇదే అని వివరించింది కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ.