రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ నుంచి పిల్లలను అపహరించిన ఆరోపణపై, యుద్ధ నేరాలపై ఆయనకు ఈ వారెంట్ జారీ చేశారు. ‘ఉక్రెయిన్ పై యుద్ధ నేరం, పిల్లలను డిపోర్ట్ చేయడం, బదిలీ చేయడం, ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యా ఆక్రమించుకోవడం వంటి వాటికి పుతిన్ పాల్పడ్డాడు’ అని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అభిప్రాయపడింది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇదే ఆరోపణలపై రష్యా సమాఖ్య అధ్యక్షుడి కార్యాలయంలోని బాలల హక్కుల కమిషనర్ మరియా అలెక్సేవ్నా ల్వోవాబెలోవా అరెస్టుకు కూడా శుక్రవారం వారెంట్ జారీ చేసింది.