AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

విశాఖపట్నం వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే వేదికగా గత శుక్రవారం ముగిసిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ రెండో వన్డేకి భారత్ తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఆస్ట్రేలియా టీంలో రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్ స్మిత్ చెప్పాడు. మ్యాక్స్‌వెల్ బదులుగా ఎల్లిస్, జోష్ ఇంగ్లిస్ బదులు కేరీ ఆడనున్నట్లు స్మిత్ తెలిపాడు. ఇక.. టీమిండియాలో కూడా రెండు మార్పులు జరిగాయి. ఇషాన్ ఇవాళ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ విశాఖ వన్డేలో దుమ్మురేపనున్నాడు. శార్దూల్ బదులుగా అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని పిచ్‌ (వికెట్‌)పై 300కు పైగా స్కోరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన వన్డే మ్యాచ్‌లను పరిశీలిస్తే…2019 డిసెంబరు 18న వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 387/5 స్కోరు చేసి రికార్డు నెలకొల్పింది. అత్యధిక వ్యక్తిగత స్కోరు (159) రికార్డు కూడా భారత్‌ సారథి రోహిత్‌శర్మ పేరిట ఉంది. కాగా ఈ వికెట్‌పై వన్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోరు (79) చేసిన చెత్త రికార్డు న్యూజిలాండ్‌ పేరిట ఉంది. 2016 అక్టోబరు 29న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 259 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ 23.1 ఓవర్లలో 79 పరుగులకు కుప్పకూలింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10