AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరికాసేపట్లో పేపర్ లీకేజ్ కేసులో నిందితుల విచారణ

హైదరాబాద్: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నిందితులను మూడో రోజు మరికాసేపట్లో హిమాయత్ నగర్‎లోని సిట్ ఆఫీస్‎లో విచారణ చేపట్టనున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి గ్రూప్ 1 పరీక్ష పేపర్‎ని లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‎ని ఎవరెవరికి ఇచ్చాడనే యాంగిల్‎లో విచారణ చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారని గుర్తించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‎లో 100 మార్కులు పైగా వచ్చిన వారి లిస్ట్‎ను బయటకు తీస్తున్నారు. అక్టోబర్‎లో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఎవరెవరితో చాటింగ్ చేశారు..ఎవరెవరితో కాల్స్ మాట్లాడారో లిస్ట్ తీయనుంది. అక్టోబర్‎లో వీరిద్దరి బ్యాంక్ ట్రాన్సక్షన్స్ పరిశీలించనుంది. గ్రూప్ 1 పేపర్ తీసుకున్న వారిని గుర్తించి..వారిపైన సిట్ కేసులు పెట్టనుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10