హైదరాబాద్: TSPSC పేపర్ లీకేజ్ కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్ను రేపటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను రేపటి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని కోర్టుకు న్యాయవాది కరుణాకర్ తెలిపారు. కాగా, ఇదే కేసులో హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కూడా రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.