AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మ‌హిళ‌ల అభ్యున్న‌తికి కృషి : మంత్రి హ‌రీశ్ రావు

సిద్దిపేట : మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం అంద‌రం క‌లిసిక‌ట్టుగా కృషి చేద్దామ‌ని, తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాలలో ముందున్నట్లే.. తెలంగాణ మహిళలు సైతం ముందుండాలి రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. మ‌హిళ‌లందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్ష‌లు తెలిపారు. బుధ‌వారం ఉద‌యం సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ మంత్రి హరీశ్ రావు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షీ టీమ్స్ ద్వారా మహిళల ర‌క్ష‌ణ‌కు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేద్దాం. అందరూ ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలాలని మంత్రి ఆకాంక్షించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10