టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఓ వైపు ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఆందోళనలతో చేస్తూంటే.. మరోవైపు పేపర్ లీకేజీలపై అధికారపార్టీ నేత, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… పేపర్ లీక్‌లు సర్వ సాధారణంగా జరిగేవే అంటూ ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపారేశారు. అప్పుడప్పుడు జరుగుతా ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. గతంలో టెన్త్, ఇంటర్ పేపర్లు కూడా లీకయ్యాయి అనే విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ (Minister KTR) దోషి అనడం సరి కాదన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలనడంలో అర్థం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ (KTR PA) గ్రామంలో అధిక మార్కులు వచ్చిన వారి జాబితా సమర్పించాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు.