హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కెసిఆర్ బయల్దేరారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కెసిఆర్ పరిశీలించనున్నారు. రైతులను కలిసి పరామర్శించి కెసిఆర్ భరోసా కల్పించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సిఎం వెళ్లనున్నారు.