AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి (Patolla Govardhan Reddy) హత్య కేసు (Murder Case)లో శుక్రవారం నాంపల్లి కోర్టు (Nampalli Court) తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ (11 Years Long Trial) తర్వాత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2012 డిసెంబర్ 27న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ ఘనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను పోలీసులు ఆరెస్టు చేశారు. ఫిబ్రవరి 2018లో ప్రధాన నిందితుడు శేషన్నను ఆరెస్ట్ చేశారు. దీనిపై 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10