మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్శ క్తి స్వరూపిణి స్త్రీ.. బహుకృత రూపిణి స్త్రీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ.. మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ.. ఇంతటి మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుందన్నారు. తల్లిగా.. తోబుట్టువుగా.. భార్యగా.. బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెల కట్టలేనివని, మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదన్నారు. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.