ఓయూ గేట్లు మూసేసిన అధికారులు
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University ) లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Paper Leakage) అంశంపై ఉస్మానియా యూనిర్సిటీ విద్యార్థులు (OU Students) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకు విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ (Arts Collage) కి విద్యార్థులు పలు దఫాలుగా వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఓయూ గేట్లను మూసివేశారు. లోపలికి ఎవరిని అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.
ప్రస్తుతం ఓయూలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష సమయం కాగానే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. మధ్యాహ్నం ఓయూలో మహాదీక్ష చేస్తామని విద్యార్థి సంఘాలు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనే మహాదీక్ష చేసి తీరుతామని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.