AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అన్నదమ్ముల గొడవపై మోహన్‌ బాబు సీరియస్‌..

మంచు వారింట జరుగుతున్న గొడవలు రోడ్డున పడ్డాయి. మంచు విష్ణు – మంచు మనోజ్‌ మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమే అని తెలిసేలా ఓ వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. దీనిపై మంచు మోహన్‌ బాబు సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

మంచు విష్ణు, మంచు మనోజ్‌ లకు పడటం లేదని చాలా రోజులుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ కూడా వేరువేరుగా ఉంటున్నట్లు తెలియగా.. ఒక్కసారిగా మంచు మనోజ్‌ తన సోషల్‌ మీడియాలో వీడియో పెట్టడంతో ఇష్యూ రచ్చెకెక్కింది. మంచు విష్ణు, మంచు మనోజ్‌ లకు పడటం లేదని చాలా రోజులుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ కూడా వేరువేరుగా ఉంటున్నట్లు తెలియగా.. ఒక్కసారిగా మంచు మనోజ్‌ తన సోషల్‌ మీడియాలో వీడియో పెట్టడంతో ఇష్యూ రచ్చెకెక్కింది.

తన మనిషి సారధిని విష్ణు కొట్టాడంటూ మనోజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇంట్లోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడంటూ విష్ణు పై మనోజ్‌ సీరియస్‌ కావడం హాట్‌ టాపిక్‌ అయింది. అయితే ఇలా ఇష్యూని సోషల్‌ మీడియా వరకు తీసుకురావడంతో మోహన్‌ బాబు సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

మంచు మనోజ్‌ కి స్వయంగా ఫోన్‌ చేసి మోహన్‌ బాబు మందలించినట్లు తెలుస్తోంది. దీంతో మంచు మనోజ్‌ తన సోషల్‌ మీడియా నుంచి వీడియో డిలీట్‌ చేశారు. అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న గొడవలు జరగడం సహజమేనని, ఇలా రచ్చ చేయడం సరికాదని చెప్పి మోహన్‌ బాబు ఫైర్‌ అయ్యారని తెలుస్తోంది.

కాగా.. మంచు విష్ణు, మంచు మనోజ్‌ నడుమ గొడవకు కారణం సారధి అనే వ్యక్తి అని తెలుస్తోంది. మంచు కుటుంబానికి సారధి అనే వ్యక్తి దగ్గరి బంధువు అని కూడా తెలుస్తుండటం మరిన్ని అనుమానాలకు తెరలేపింది. ఈ ఘటనపై మంచు మనోజ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంచు మనోజ్‌.. తన అక్క మంచు లక్ష్మి ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ ఈ ఇష్యూపై నేరుగా రియాక్ట్‌ కాలేదు. అన్నదమ్ములు అన్నాక చిన్న చిన్న గొడవలుండటం సాధారణ విషయమని, ఆవేశం అనర్థానికి దారి తీస్తుందనే విషయాన్ని తన కొడుకులు అర్థం చేసుకోలేకపోతున్నారని మోహన్‌ బాబు ఓ మీడియాతో ఫోన్‌ లో చెప్పడం జరిగింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10