AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాహుల్ గాంధీ వేటుపై సుప్రీంకోర్టులో పిటిషన్!

న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై సుప్రీంకోర్టులో నేడు పిటిషన్ దాఖలయింది. ఆటోమేటిక్ అనర్హత వేటును సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలయింది. ఎలాంటిది, తీవ్రత ఎంత, ఎంతటి ఘోర నేరం అనే అంశాల ఆధారంగా తీర్పును సవాలు చేయడం జరిగింది. మలప్పురం సామాజిక కార్యకర్త ఆభా మురళీధరన్ తరఫున అడ్వొకేట్ దీపక్ ప్రకాశ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రజాప్రాతినధ్య చట్టం,1951లోని సెక్షన్ 8(3) ప్రకారం ఆటోమేటిక్ అనర్హత వేటు అంటూ ఏదీ లేదని పేర్కొన్నారు.

ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎందుకు ఉంది?’ అన్నందుకు మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చేస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత లోక్‌సభ సచివాలయం శుక్రవారం ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది.

లిలీ థామస్ కేసు(2013)ను పునర్విచారించాల్సి ఉంది. 1951 చట్టంలోని అధ్యాయం 3 కింద అనర్హత వేటును నేర తీవ్రత, సీరియస్‌నెస్‌ను బట్టి వర్గీకరించాల్సి ఉంది. ‘లిలీ థామస్ కేసు ఆపరేషన్లను దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కక్షపూరిత విధానంతో ఉపయోగిస్తున్నారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘లిలీ థామస్ కేసు తీర్పు నుంచి పరువు నష్టంను మినహాయించాలని, లేకుంటే పౌరుల ప్రాతినిధ్య హక్కుపై అది ప్రభావం చూపగలదు’ అని పిటిషనర్ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10