పోరాటం చేస్తున్న పేదలకోసం అండగా నిలబడతా
జోగురామన్నకు ఆదివాసీల గోడు పట్టడంలేదు
మొద్దునిద్ర పోతున్న ఎమ్మెల్యేకు వీరి బాధలు ఎలా తెలుస్తాయి
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మండిపాటు
ఆదిలాబాద్: నిరుపేదలైన ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ కాలనీ, పలు కాలనీలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు కంది శ్రీనన్నకు ఆత్మీయ స్వాగతం పలికారు. శ్రీనివాసరెడ్డి గడపగడపకు తిరుగుతూ.. కాలనీవాసులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారి గోస ఎవరికీ పట్టడంలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే జోగురామన్న ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని అన్నారు. ఎంతసేపూ కమీషన్ల కోసం వెంపర్లాడటమేనని, అభివృద్ధి ఏ మాత్రం పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
14 ఏళ్లు ఎమ్మెల్యే గా ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేదలు, ఆదివాసీల కోసం అండగా నిలబడతానన్నారు. వారి పోటాలకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుందన్నారు. వీరి సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించాలన్నారు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.