మన భూమికి సౌర తుపాన్ ఈనెల 24 గురువారం తాకింది. వాస్తవానికి ఇది చాలా శక్తివంతమైన సౌర తుపాన్. అయితే ఇది రావడం ఎవరూ గమనించలేక పోయారని అమెరికా నేషనల్ ఓషన్ , అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది గ్రేడ్ జి 4 స్థాయికలిగిన భూ అయస్కాంత తుఫాన్‌గా వారు అంచనా వేశారు.
ఈ జి 4 గ్రేడ్ స్థాయి సౌర తుపాన్ సాధారణంగా పవర్ గ్రిడ్‌లపై అత్యంత విస్తారంగా వోల్టేజీ సమస్యలను తీసుకు వస్తుంది. గ్రిడ్ కు చెందిన ఎలెక్ట్రిక్ పరికరాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సౌర తుపాన్ కారణంగా స్పేస్ ఫ్లైట్ కంపెనీ రాకెట్ ల్యాబ్ తన ఎలెక్ట్రాన్ రాకెట్ ప్రయోగాన్ని తుపాన్ ప్రభావం తగ్గేవరకు దాదాపు 90 నిమిషాల సేవు ఆపాల్సి వచ్చింది. సౌర ఉద్గారాల వల్ల భూమి అయస్కాంత క్షేత్రానికి అవాంతరాలు కలుగుతాయి.
సూర్యుని ద్రవ్యరాశి అత్యంత వేగంగా మన భూమికి చేరుకుంటుంది. అయస్కాంత వలయాన్ని తాకుతుంది. అయస్కాంత క్షేత్రాల వల్ల భూమి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. సూర్యుని నుంచి వెలువడే కణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తుంది. అయితే ఎంతో శిక్షణ పొందితేనే కానీ ఇదంతా చూడలేం.