AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నవీన్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. అతని కుటుంబంలో ఒకరికి పొరుగుసేవల విధానంలో ఉద్యోగం కల్పించారు. మంత్రి కేటీఆర్ (KTR) ఆదేశాల మేరకు నవీన్ రెండో సోదరుడికి జిల్లా కేంద్రంలోని JNTUలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జ్, ఎమ్మెల్సీ బస్వరాజుసారయ్య బాధిత కుటుంబానికి సంబంధిత నియామక పత్రన్ని అందజేశారు.

ఉద్యోగం దొరకటం లేదనే మనస్థాపంతో..
ఉద్యోగం దొరకడం లేదనే ఆవేదనతో సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన చిటికెన నవీన్‌ ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ ఆత్మహత్యపై తెలంగాణలో పెద్ద దుమారమే చేలరేగింది. గ్రూప్‌-1 పరీక్షలు రాసిన నవీన్.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కావటంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించారు. నవీన్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఆక్షేపించారు. అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాయి. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంనది చెప్పటానికి నవీన్ ఉదంతమే ఉదాహరణ అని మండిపడ్డారు.

అయితే నవీన్ అసలు గ్రూప్-1 పరీక్షకు కనీసం అప్లై కూడా చేయలేదని ఆయన తండ్రి కీలక విషయాలు వెల్లడించారు. తన కుమారుడు గ్రూప్-1 పేపర్ లీకేజీ కావటం వల్లే మనస్తాపం చెంది చనిపోయాడంటూ అసత్య వార్తలు వైరల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 30 ఏళ్ల కుమారుడు చనిపోయి బాధలో ఉంటే.. ఇలాంటి వార్తల వల్ల మరింత కుంగిపోతున్నామని అన్నారు. నవీన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముందే ఆయన ఈ విధంగా స్పందించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10