విద్యా బాలన్ గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో బాలకృష్ణ హీరోగా చేస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హిందీలో విద్యా బాలన్.. పలు విజయవంతమైన చిత్రాలు చేసింది. ‘ఇష్కియా’, ‘ది డర్టీ పిక్చర్’, ‘కహాని’ లాంటీ చిత్రాలు చేసి.. యావత్ దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ డబ్బూ రత్నాని కేలండర్ కోసం దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్చీపై కూర్చుని.. దుస్తులు లేకుండా ఉన్న విద్యాబాలన్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఒక చేతిలో న్యూస్ పేపర్.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని కూర్చుంది. దీంతో విద్యాబాలన్ ఫోటో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. కొందరు ట్రోల్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అదరహో విద్యా అంటూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు.