మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, హిందూ దేవతలను అవమానించారంటూ తాప్సీపై ఫిర్యాదు అందింది. హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు.
ష్యాషన్ షోలో భాగంగా మెడలో లక్ష్మీహారం వేసుకొని తాప్సీ అశ్లీలంగా క్యాట్‌వాక్ చేసినట్టు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కేసు కూడా నమోదయ్యింది. హిందూ దేవతలను తాప్సీ అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇండోర్‌లోని హింద్ రక్షక్ సంఘటన్ తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు, అశ్లీలతను వ్యాప్తి చేసినందుకు ఈ ఫిర్యాదు చేసినట్లు హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ తెలిపారు.
తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చి 14, 2023న ఒక వీడియోను అప్‌లోడ్ చేశారని గౌర్ తెలిపారు. ఫిర్యాదు ప్రకారం, వీడియోలో ఒక ఫ్యాషన్ షో ఉంది. అభ్యంతరకరమైన దుస్తులు ధరించి, లక్ష్మీదేవి లాకెట్‌ను మెడలో వేసుకోవడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మెడలో లక్ష్మీదేవి లాకెట్ కంటే అశ్లీలతే ఎక్కువగా హైలైట్ అవ్వడం ముమ్మాటికీ మనోభావాలు దెబ్బతీయమడే అంటున్నారు. ఇప్పుడీ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి.
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో జరిగిన ర్యాంప్ వాక్‌పై తమకు ఫిర్యాదు అందిందంటున్నారు పోలీసులు. ‘లక్ష్మీదేవి’ ఉన్న లాకెట్‌ను ధరించి శృతిమించిన రేంజ్‌లో ర్యాంప్ వాక్ చేయడం మతపరమైన మనోభావాలను మరియు ‘సనాతన ధర్మ’ ప్రతిష్టను దెబ్బతీసినందుకు నటి తాప్సీ పన్నుపై తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.