నాకు సంస్కారం అడ్డొస్తుంది..ఎమ్మెల్యే రఘునందనరావు
మంత్రి కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని.. చదువుకున్న వాడిగా కేటీఆర్ (Telangana Minister) కు తగదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (BJP MLA Raghunandan Reao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… మోదీ (PM Modi)ని, బీజేపీ (BJP)ని డిఫెండింగ్ చేయడమే పనిగా కేటీఆర్ పెట్టుకున్నారన్నారు. ప్రధాని మోదీ బ్రోకరిజం చేశారని కేటీఆర్ నిరూపించాలన్నారు. ‘‘కేటీఆర్ రాజు అయ్యేది లేదు.. యువరాజు అయ్యేది కూడా లేదు మోదీ వయసు ఎంత … నీ వయసు ఎంత?. హఫీజ్‌పేట్‌లో భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీలు వేయలేదు?. సర్వే నెంబర్ 77లో భూమిని హైకోర్టు ఉత్తర్వులు కాదని ఓ వ్యక్తికి లాభం చేకూరేలా చేయలేదా. నిన్నేమనాలి బ్రోకర్, మూర్ఖుడు అనాలా… నాకు సంస్కారం అడ్డొస్తుంది. ఈ భూమిలో అపార్ట్‌మెంట్ కట్టేందుకు అనుమతి ఎలా ఇచ్చారు.
రూ.500 కోట్ల లబ్ది పొందిన ఆ వ్యక్తి నీకేమీ చేయలేదా. కోర్టు సస్పెండ్ చేసిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమిపై విచారణ కొనసాగుతోంది. ఇక్కడ 8ఎకరాల భూమిని ఓ వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నాడు. ఇప్పటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ అపార్ట్‌మెంట్‌కు అనుమతి ఇచ్చారు. దీన్ని ఏమనాలి.. ఎవరు బ్రోకరిజం చేసారు. మీరు ఎక్కడ నీతిగా , నిజాయితీగా లేరు. హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇక్కడ జరిగిన అవకతవకలపై ఏం మాట్లాడుతారు. గతంలో ప్రధాన మంత్రిని తిడితే బొక్కలో వేయమని డీజీపీకి చెప్పాడు. మరి కేసీఆర్ సూచనల మేరకు మోదీని తిట్టినందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కేసీఆర్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి.. అవి మాట్లాడుతున్నారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.