AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

శ్రీరామనవమి శోభాయాత్ర (Sri Rama Shobha Yatra) సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా గోషామహల్‌, సల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్ల (Sultan Bazaar PS) పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.

గురువారం ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్‌ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్‌, మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్దంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకు (Hanuman Vyamshala) యాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారిమళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10