నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారుపై జెసిబి పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న మరో ఇద్దరినీ బయటకి తీసి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
బాధితులు మోర్తాడ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.