క్రికెట్ ఫ్యాన్స్ లో ఇప్పటికే ఐపీఎల్ హడావిడి మొదలయింది. ఫ్యాన్స్.. ప్రతీ అడుగులో తమ అభిమాన జట్టును ఇప్పటినుంచే ఫాలో అవుతున్నారు. మా జట్టే గెలుస్తుంది అంటూ బెట్టింగ్ లు స్టార్ట్ చేసి ఉంటారు. అయితే, ముంబై అభిమానులకు సీజన్ మొదలవక ముందే మేనేజ్మెంట్ ఓ చేదు వార్తను ప్రకటించింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ ముగియడంతోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో తనపై అదనపు భారం, గాయాల బెడద తగ్గించుకోవడం కోసం రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ మ్యాచ్ లు ఆడనప్పుడు డగౌట్ లో కూర్చొని టీంను, సారథిని గైడ్ చేస్తాడని ముంబై మేనేజ్మెంట్ వివరించింది.
ఇప్పటివరకు ముంబైని ఐదు సార్లు ఛాంఫియన్ గా నిలబెట్టిన రోహిత్ ముంబై జట్టుకు దూరం అవడం పెద్ద సవాల్. ఆ జట్టు ఈ సీజన్ లో ఎలా రాణిస్తుందో చూడాలి. అయితే, గతేడాది ఐపీఎల్ సీజన్ లో ముంబై దారుణంగా విఫలమై పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.