దొంగ, లంగ దందాలు చేసేవాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదు
మహిళలు తలెత్తుకునేలా చేస్తున్న పాలన మోదీదే
మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ ఫైర్
హైదరాబాద్: ‘‘కేసీఆర్ కూతురు దొంగ దందాలతో ప్రజలకేం సంబంధం? కవిత దొంగ దందా ప్రజల కోసం చేస్తున్నారా? ఆ సొమ్ముతో రుణమాఫీ చేస్తున్నారా?? జీతాలిస్తున్నారా? నిరుద్యోగ భ్రుతి ఇస్తున్నారా?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఏనాడూ తలవంచని తెలంగాణ కేసీఆర్ బిడ్డ చేస్తున్న దొంగ, లంగ దందాలతో దేశం ముంద తలవంచే పరిస్థితి నెలకొందని అన్నారు. లిక్కర్ స్కాంతో బీఆర్‌ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోందని చెప్పిన బండి సంజయ్ లిక్కర్ స్కాం దోషులెవరినీ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ తోపాటు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కార్యదర్శి జయశ్రీ, జాతీయ మహిళా మోర్చా నాయకులు నళిని, కరుణాగోపాల్, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
. మహిళల గురించి ఆలోచించి, గౌరవించి, ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించే పార్టీ బీజేపీ. మహిళలు శక్తి స్వరూపులు… దేవతలుగా కొలిచే సంస్కృతి మనది.
. మహిళలు ఇంకా వంట గదికే పరిమితం కావాలనుకోవద్దు. అయినప్పటికీ వంటకే పరిమితమైన వాళ్లెందురో ఒకవైపు కుటుంబాన్ని పోషిస్తూనే… మరోవైపు ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు. వంటలు చేసే యాదమ్మ మోదీగారికే వండి పెట్టింది. గంగమ్మ వంటి వాళ్లు ఈరోజు టీవీల్లో యువతతో పోటీ పడుతున్నారు.
.తెలంగాణలో మహిళలకు అడుగడుగునా అవమానాలే. ప్రీతి హత్య జరిగితే కేసీఆర్ కొడుకుకు పరామర్శించే టైం లేదు. కానీ సానియా మీర్జా వద్దకు మాత్రం వెళతాడు..
. నరేంద్రమోదీ మహిళల గొప్పతనాన్ని అమెరికాలో చెప్పారు. బిడ్డలను పెంచేందుకు తనతల్లి పడ్డ బాధలను చెప్పారు. తన తల్లిలాగా మహిళలెవరూ బాధపడొద్దని ఎన్నో చర్యలు తీసుకున్నారు.
. జల్ జీవన్ మిషన్ కింద 6 కోట్ల మందికి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రధానిగా ఎర్రకోటపై టాయిలెట్ల గురించి మాట్లాడితే ఛాయ్ వాలా ప్రధాని అయితే ఇట్లనే ఉంటుందని ప్రతిపక్షాలు హేళన చేశారు..కానీ స్వచ్ఛ భారత్ కింద 11 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మోదీగారిదే.
. గతంలో కిరోసిన్ దీపాలతో బిక్కుబిక్కుమంటున్న ఇండ్లకు సౌభాగ్య స్కీం ద్వారా 2.5 కోట్ల మందికి కరెంట్ కనెక్షన్లు ఇచ్చిన గొప్ప నేత మోదీ. నిలువనీడ లేని 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించిన ఘనత మోదీగారిదే. 25 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు తెరిచి ఆర్దికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు. ముద్రలోన్లు ఇస్తున్నరు.
. నరేంద్రమోదీ టైంలోనే కేసీఆర్ సీఎం అయ్యారు.. ఒక్కసారి ఎవరి పాలన బాగుందో బేరీజు వేసుకోండి… కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళ లేరు.. మహిళా కమిషన్ లేదు. ఆ పార్టీలో మహిళా అధ్యక్షురాలు ఉండదు… ఆ పార్టీలో మహిళ అంటే కవిత ఒక్కరే…బతకమ్మ ఆడాలంటే కవితే. బతుకమ్మ పేరుతో డిస్కోలు ఆడిరచి తెలంగాణ సంస్క్రుతినే దెబ్బతీసిన వ్యక్తి కవిత. కేసీఆర్ పాలనలో బతుకమ్మకే గౌరవం లేకుంటే ఇగ సాధారణ మహిళలకేం గౌరవం ఉంటుంది.
. బీజేపీ సంస్థాగత పదవుల్లో 30 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నాం. అట్లయితేనే జాతీయ నాయకత్వం ఆమోదిస్తుంది. రాష్ట్రపతిగా మహిళను చేశాం. 8 మంది గవర్నర్లను, నలుగురు సీఎంలను, 11 మంది కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదే.
. లిక్కర్ స్కాంలో కవిత వికెట్ అవుట్. బీఆర్‌ఎస్ వికెట్లన్నీ క్లీన్ బౌల్డ్ కాబోతున్నరు. దొంగ సారా, పత్తాల దందా చేసేటోళ్లను వదిలే ప్రసక్తే లేదు. లిక్కర్ దందా చేస్తూ తెలంగాణ వంచదని అంటోంది… కేసీఆర్ బిడ్డ చేసిన దొంగ దందా వల్ల తెలంగాణ మహిళలు ఇయాళ తలదించుకునే పరిస్థితి ఏర్పడిరది.
. కేసీఆర్ పొరపాటున మళ్లీ సీఎం అయితే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసేవాళ్లకు ప్రోత్సహకాలు ఇస్తారేమో..నని బండి సంజయ్ అన్నారు.