మధ్యప్రదేశ్(Madhyapradesh) ఇండోర్ (Indore) స్నేహ్ నగర్ పటేల్ నగర్ శ్రీ బోలేశ్వర్ మహాదేవ్ ఝూలేలాల్ మందిరం వద్ద ఘటన జరిగింది. దేవాలయంలోని బావి వద్ద భక్తులు పూజలు చేస్తుండగా మందిరం పైకప్పు కూలిపోయింది. దీంతో భక్తులు బావిలో పడిపోయారు. కనీసం 25 మంది భక్తులు బావిలో పడిపోగా పదిమందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ ఏడుగురిని వెలికి తీశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కలెక్టర్, కమిషనర్లతో మాట్లాడారు, ఘటనపై విచారణకు ఆదేశించారు. పండుగ వేళ జరిగిన ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు.