కర్నూలు – పోలీస్ స్టేషన్లో మాయమైన వెండి కేసులో. పోలీసులే దొంగలుగా తేలింది. కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 105 కిలోల వెండి అపహరణ మిస్టరీ వీడింది. వివరాలను పరిశీలిస్తే 2021 జనవరి 28న పంచలింగాల చెక్పోస్ట్ వద్ద సీజ్ చేసిన 105 కిలోల వెండి, రూ. 2.5 లక్షల నగదు కదిరి పోలీస్స్టేషన్లో ఉంచగా మాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసు పై దృష్టి సారించిన జిల్లా ఎస్పీ ఆదేశించగా , ఉన్నతాధికారుల నేతృత్వంలో విచారణ చేశారు. వీరి విచారణలో ఇద్దరు పోలీసుల పాత్ర ఉన్నట్లు బహిర్గతమైంది. కర్నూల్ తాలుకు అర్బన్ పోలీస్ స్టేషన్లో గతంలో పనిచేసిన మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణ ఈ దొంగతనం చేసినట్లు తేలింది. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..