ప్రధాని మోడీని తిడుతూ కల్వకుంట్ల కుటుంబం టైంపాస్ పాలిటిక్స్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోడీని బ్రోకర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బ్రోకర్..కేసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్ అని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకై 30 లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే..కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి..సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ట్విట్టర్ టిల్లు కేటీఆర్, లిక్కర్ క్వీన్ కవిత, హ్యాపీ రావు సంతోష్, అగ్గిపెట్టె రావు హరీష్ రావులే తెలంగాణను ఏలుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుందని…తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా బీజేపీ అవతరించిందని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రాలేదని వెల్లడించారు.