హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజాము నుంచి పలు చోట్ల ఈడీ(ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) (ఈడీ) సోదాలు(ED searches) చేస్తోంది. ప్రముఖ ఫార్మా కంపెనీల డైరెక్టర్ గోపికృష్ణ ఈడీ ఆకస్మిక సోదాలు చేస్తోంది. ఏక కాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. తెల్లవారుజాము నుండి బంజారాహిల్స్, పఠాన్ చెరువు, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడీ(Directorate of Enforcement) సోదాలు చేస్తోంది. జువెన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లు, వారి కార్యాలయాలలో 15 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ మాదాపూర్‌లోని ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్ళల్లో సోదాలు చేస్తోంది. Phoenix టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్ గోపికృష్ణ(Gopikrishna, Director at Phoenix Tech Zone Pvt) పాటిబండ ఇంట్లో కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌ని(Jubilee Hills) రోడ్డు నెంబర్ 48లోని డైరెక్టర్ ఇంట్లో సోదాలు చేస్తోంది.
గోపికృష్ణ మొత్తం 19 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నట్లు సమాచారం. కంపెనీలు ఫోనిక్స్ ఇన్ఫో సిటి, ఫోనిక్స్ వెంచర్స్, ఫోనిక్స్ స్పెసెస్, హైదరాబాద్ ఇన్‌ఫ్రా సిటి, ఫోనిక్స్ అర్బన్ డెవలపర్స్, ఫోనిక్స్ టెక్ స్పేస్, ఫోనిక్స్ మల్టీ ఫ్లెక్స్, ఫోనిక్స్ ఇన్ఫో స్పేస్, ఫోనిక్స్ టెక్ జోన్, ఫోనిక్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లతో పాటు మరికొన్ని కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఇవి కాక మరో 15 కంపెనీలకు అసోసియేట్‌గా ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు గోపికృష్ణపై ఫోనిక్స్ సంస్థ పై ఐటి సోదాలు జరిగాయి. ఐటీ సోదాల అనంతరం ఇప్పుడు రంగంలోకి దిగిన ఈడీ(Directorate of Enforcement) మనీలాండరింగ్ పాల్పడ్డారని కోణంలో ఈడీ సోదాలు చేస్తోంది.