AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండి సంజయ్, రేవంత్‌‌కు షర్మిల ఫోన్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Leader bandi Sanjay), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy)కి వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila)ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని ఇరువురు నేతలను షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని షర్మిల సూచించారు. సీఎం కేసీఆర్ (CM KCR) మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని అన్నారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ (Telangana CM) బ్రతకనివ్వరని తెలిపారు. షర్మిల ఫోన్‌కాల్‌పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా… టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశాన్ని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సీరియస్‌గా తీసుకున్నారు. లీకేజ్‌లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు షర్మిల పోరాటం చేశారు. రెండు సార్లు షర్మిల పోరాటాన్ని పోలీసులు అడ్డుకోగా.. నిన్న మూడో సారి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో కలిసి నిరుద్యోగుల విషయంలో పోరాడాలని షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ నేత బండిసంజయ్, కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డికి ఫోన్‌లు చేసి.. కలిసి పోరాడుదామంటూ షర్మిల పిలుపునిచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10