ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
భారత స్టార్ బాక్సర్, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో స్వర్ణాలు సాధించి తెలంగాణ ఆణిముత్యం నిఖత జరీన్ చరిత్ర సృష్టించింది.
వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత తొలిసారి సొంత గడ్డపై అడుగు పెట్టిన నిఖత్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.