ఒకే బొమ్మలో అనేక చిత్రాలు కనిపించేలా బొమ్మలు గీయడంలో ఆయనది అందెవేసిన చేయి.తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల ఉత్సవం, శివసత్తులు, పోతరాజుల నృత్యాన్ని ఆయన బొమ్మల్లో చిత్రీకరించారు. ఇప్పటి వరకు అనేక మందితో ప్రశంసలు అందుతున్న ఈ ఫోటోలు ఇప్పుడు ఆదిలాబాద్‌లో ప్రదర్శనకు ఉన్నాయి. ఆయన మరెవరో కాదు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చేయి తిరిగిన చిత్రకారుడు అన్నారపు నరేందర్.
ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ పి.ఎస్. రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన బొమ్మలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఛాత్రోపాధ్యాయులు, పట్టణానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులు నరేందర్ చిత్రాలను ఆసక్తిగా తిలకించారు.