రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో MAA AAI ప్రొడక్షన్స్ LLP సమర్పణలో దర్శకుడు ప్రవణ్ ప్రభ రూపొందుతోన్న చిత్ర “షష్టిపూర్తి”. ఈ చిత్రం పూజా కార్యక్రమం చెన్నైలోని ఇసైజ్ఞాని ఇళయరాజా స్టూడియోస్‌లో శుక్రవారం (31-3-2023) జరిగింది. ముహూర్తపు షాట్ కి సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి క్లాప్ కొట్టగా, సంగీత దర్శకుడు ఇళయరాజా కెమెరా స్విచాన్ చేశారు.
హీరోగా నటిస్తున్న రూపేష్ కుమార్ మా ఆయ్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్ లో ఆ చిత్రాని నిర్మింస్తున్నారు. ‘క్లాప్’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్న ఆకాంక్ష సింగ్ రూపేష్ కుమార్ కు జంటగా నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన, ‘కాంతారావు’ ఫేమ్ అచ్యుత్ కుమార్, వై విజయ, శుభలేఖ సుధాకర్ మరియు పలువురు ప్రముఖ నటీనటు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నాలుగు పాటలున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభమై మూడు షెడ్యూల్‌లతో తక్కువ వ్యవధిలో పూర్తి కానుంది. జులై 2023లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సాంకేతిక సిబ్బంది
బ్యానర్: మా ఆయి ప్రొడక్షన్స్ LLP
నిర్మాత: రూపేష్ కుమార్ చౌదరి
దర్శకుడు: పవన్ ప్రభ
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
డీఓపీ: రామిరెడ్డి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ మరియు
రెహమాన్
కొరియోగ్రఫీ: బృందా
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ బాను