AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ క‌న్నుమూశారు. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న అనారోగ్య కార‌ణాల‌తో బాధ‌ప‌డుతూ ఆదివారం చెన్నైలోని త‌న నివాసంలో కాలం చేశారు. ఆయ‌న మృతిపై చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపాన్ని వ్య‌క్తం చేస్తుంది. కాస్ట్యూమ్స్ కృష్ణ అస‌లు పేరు మాదాసు కృష్ణ‌. విశాఖ స్వ‌స్థ‌లం.

కాస్ట్యూమ్స్ కృష్ణ సినిమా రంగంపై ఆస‌క్తితో 1954 లో మద్రాస్ వెళ్ళి, అక్కడ అసిస్టెంట్ కాస్ట్యూమర్ గా జాయిన్ అయ్యారు.త‌న‌దైన క‌ష్టంతో త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత రామానాయుడు సంస్థలో ఫుల్ టైమ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ప‌ని చేస్తూ వ‌చ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి హీరోల నుంచి వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్స్ వరకూ చాలా మంది సినిమాల్లో ఆయ‌న ప‌ని చేశారు. ట్రెండ్ కి తగ్గట్టు హీరోలకి బెల్ బాటం నుంచి బ్యాగీ ప్యాంట్టు వరకూ చాలా రకాల మోడల్ దుస్తులను హీరోలకి డిజైన్ చేసిచ్చారు. ఆయ‌న దుస్తులు అప్ప‌ట్లో ట్రెండ్ క్రియేట్ చేశాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10