సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలం బంజరుపల్లి బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మండల పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…. మండు వేసవి ఏప్రిల్ నెలలో చెరువులు మత్తడి దూకడం అనేది కల. ఆరోజుల్లో బతుకమ్మ వేయడానికి గుంతలు తీసి నీళ్ళు పోసి వేసేవాల్లం. కలలో కూడా ఊహించలేని పనులు నేడు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు 2014లో 30కోట్ల 28లక్షల రూపాయల వడ్లు పండితే, గతేడాది 344 కోట్ల 16 లక్షల వడ్లు పండాయన్నారు. కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల కానే కాదు అన్న రంగనాయక సాగర్ తెచ్చుకున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల నుంచి తాగునీరు, సాగునీరు ఇవ్వలేదని గుర్తుచేశారు.
ఢిల్లీలో ఒకడేమో కాళేశ్వరం దండగా అంటాడని, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పండుగల పెట్టిన పెట్టుబడితో ఎప్పుడో నిండి పోయిందన్నారు. దండగా అనేది ప్రతి పక్షాలకు దండగా అయిందని విమర్శించారు. గతంలో కాలం కోసం ఆకాశం వైపు చూస్తే.. ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నామని వివరించారు. మహారాష్ట్ర నుంచి 150 మంది రైతుల బృందం మన ప్రాజెక్ట్ లు చూడడానికి వచ్చారని, దేశంలోని రైతులు నేడు కేసీఆర్ వైపు చూస్తున్నారు మంత్రి వెల్లడించారు.