అయిదు ఓవర్లలోనే 73 పరుగులు
హైదరాబాద్ ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ 2023 టోర్నిలో భాగంగా నేడు సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నది.. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ భువనేశ్వర కుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కీపర్ బ్యాట్స్ మెన్ సంజు శాంసన్ నాయకత్వ వహిస్తున్నాడు.. ఇక జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్ లు రాజస్థాన్ రాయల్స్ తరుపున బ్యాటింగ్ ఆరంభించారు.. సన్ రైజర్స్ స్కిపర్ భువనేశ్వర్ తొలి ఓవర్ ప్రారంబించాడు.. ప్రారంభం నుంచే జైశ్వాల్, బట్లర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.. కేవలం అయిదు ఓవర్లలోనే 73 పరుగులును ఈ ఇద్దరు పిండుకున్నారు.. జోస్ 42, యశస్వీ 30 పరుగులతో దూకుడుగా ఆడుతున్నారు.. భువనేశ్వర్, వాష్టింగ్టన్ సందర్, నటరాజ్ బౌలింగ్ ఫోర్లు, సిక్సర్లతో జోస్, యశస్వీ ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్నారు..
సన్ రైజర్స్ జట్టు
భువనేశ్వర్ కుమార్ , అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, వాష్టింగ్టంన్ సుందర్, అదిల్ రషిద్, ఫజల్ ఫరూఖీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజ్
రాజస్థాన్ రాయల్స్ జట్టు
సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్, దేవదత్త పడికల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్ మెయిర్, జాసన్ హోల్డర్, ఆర్ అశ్విన్ , యుజువేంద్ర చావల్, ట్రెంట్ బోల్ట్, కె ఎం అసిఫ్