పెళ్లి సందD (Pelli SandaD) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ సినిమాలో అమ్మడి కట్టు బొట్టు చూసి మేకర్స్ వరుస అవకాశాలు ఇస్తున్నారు. రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న శ్రీలీల.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకొచ్చింది.
NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తనదైన మార్క్ కామెడీ జోడిస్తూ ఈ సినిమాను రూపొందించబోతున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ ప్లాన్స్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఇందులో శ్రీలీల రోల్ ఏంటనేది తెలియాల్సి ఉంది. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపిస్తుందని అన్నారు కానీ.. లేటెస్ట్ సమాచారం మేరకు శ్రీలీలకు బాబాయ్ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు అన్నయ రోల్ శరత్ కుమార్ పోషిస్తున్నారని, ఆయన డాటర్ రోల్ లో శ్రీలీల కనించనుందని