AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆత్మీయ సమ్మేళనంలో వనమా రాఘవ..

వనమా రాఘవ.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన ఎవరో కాదు.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు. వనమా రాఘవ ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యలకు కారణమయ్యాడని అప్పట్లో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఈయన పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరై.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు వనమా రాఘవేంద్రరావు.

కొత్తగూడెం నియోజకవర్గంలోని రామవరంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ హాజరై… సెంట్రల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తనయుడికి బీఆర్ఎస్ నాయకులు సన్మానాలు, గజ మాలలతో సత్కారాలు చేసి, ఆయన్ను సంతోష పెట్టారు. ఇది చూసిన చాలామంది పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యానికి లోనయ్యారు. పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబ సభ్యుల ఆత్మహత్యలకు కారణమైన యువ నాయకుడిని పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ.. మళ్లీ బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడా..? అనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే కుమారుడిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేశారా..? లేక ఆయనే వచ్చాడా..? అనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది. మరోవైపు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నాడా…? అనే అంశం సైతం చర్చనీయాంశంగా మారింది.

కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రాఘవ… ఉన్నట్టుండి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కనిపించే సరికి పార్టీ నాయకులు.. ఆయన మెప్పు పొందేందుకు తెగ ఆరాటపడ్డారు. సన్మానాలు, ఆత్మీయ పలకరింపులతో హడావుడి చేశారు. అంతేకాదు.. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లోనూ వనమా రాఘవ ఫొటోలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎమ్మెల్యే కుమారుడు మరోసారి తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10