డీజీపీకి హైకోర్టు ఆదేశం
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహానీ ఉందని, రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోమటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం.. రెండు వారాల్లో రాజగోపాల్ రెడ్డికి భద్రత కల్పించాలని ఆదేశించింది. 2+2 సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇక గతేడాది కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2018లో కాంగ్రెస్ టికెట్‌పై మునుగోడు నియోజవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2022 చివర్లో పార్టీకి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతరం బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కోమటిరెడ్డి ఓటమి పాలయ్యారు.