ప్రీతి పోస్టుమార్టం పై అనుమానాలు
వరంగల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసుపై రోజుకో చర్చ సాగుతోంది. నిన్నటి వరకు ఆమె పోస్టుమార్టం రిపోర్టు పోలీసుల చేతికి వచ్చిందన్న ప్రచారం సాగింది. కానీ సోమవారం వంగల్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇంకా పోస్టు మార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ వివరాలు రాలేదని వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే అన్నీ వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కానీ మరో వైపు నుంచి టాక్సాలజీ రిపోర్టు పోలీసుల చేతికి అందిందన్న ప్రచారం సాగుతోంది. ఇందులో ఆమె విష పదార్థాలు ఏమీ లేవని తేలినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకాలం ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే చర్చ జోరుగా సాగింది. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఆమె ఇంజక్షన్ తీసుకొని చనిపోయినట్లు భావిస్తున్నట్లు నిర్దారణకు వచ్చారు. కానీ ప్రీతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టు మార్గం రిపోర్టుపై ఉత్కంఠ నెలకింది.
కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి తన సీనియర్ విద్యార్తి సైఫ్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసి విచారించారు. అయితే సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి సూసైడ్ అటెమ్ట్ చేసిందని కొన్ని వివరాలను చేకరించిన పోలీసులు ఆయనను రిమాండ్ లోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో వైపు ప్రీతి శరీరంలోకి కావాలనే ఎవరో ఇంజక్షన్ ఇచ్చి చంపేశారని ప్రీతి సోదరుడు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి రక్త నమూలనాలను టాక్సాలజీకి పంపించారు.
ఇప్పుడు ఆ రిపోర్టు వచ్చిన తరువాత ప్రీతి శరీరంలో ఎలాంటి పాయిజన్ ఉంది? దీనిని ఆమె తీసుకుందా? లేక ఎవరైనా బలవంతంగా ఎక్కించారా? అనేది విచారణ చేయనున్నారు. కానీ ప్రీతి చేతిపై కొన్ని గాయాలున్నాయని ఇవి చూస్తుంటే ఆమెపై ఎవరో దాడి చేసి ఇంజక్షన్ చేశారని ప్రీతి సోదరుడు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో విచారణను వేగవంతం చేయాలని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కళాశాలలో ర్యాగింగ్ భూతంలో అనేక మంది విద్యార్థులు బలవుతున్నారని రాజకీయ పార్టీలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నుంచి పోలీసుల చేతికి టాక్సాలజీ రిపోర్టు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ప్రీతి రక్తంలో ఎలాంటి విష పదార్థాలు లేవని తేలినట్లు తెలుస్తోంది.
దీంతో ఆమె ఇంజక్షన్ కారణంగా కాకుండా మరే కారణంతో మరణించిందన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. అయితే వరంగల్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ టాక్సాలజీ రిపోర్టు ను ఫైనల్ చేయలేమని పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే నిజాలు బయటపెడుతామని అంటున్నారు. మరో రెండు రోజుల్లో అన్ని వివరాలు తెలియజేస్తామంటున్నారు. అయితే ఇప్పటికే పోలీసుల చేతికి ఈ రిపోర్టులు అందాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ రిపోర్టును పోలీసులు బయటపెట్టకుండా దాచేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పోస్టుమార్టం రిపోర్టులో ఏముంటుందోనన్న చర్చ సాగుతోంది.