మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న కుమార్తె సుస్మితకు మెమరబుల్ గిఫ్ట్ అందించారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్లో వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా.. అటు ఫ్యామీలికి కూడా సమయాన్ని కేటాయిస్తారు. ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్ రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారు. తన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేసిన క్షణాలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు చిరు. చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ లుక్లో అదరగొట్టారు చిరు. అయితే చిరంజీవి లుక్స్ వెనక ఆయన పెద్ద కూతురు సుస్మిత హస్తం ఉంది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పవర్ ఫుల్ గా కనిపించేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సినిమా చిరు లుక్స్.. క్యాస్టుమ్స్ పట్ల సుస్మిత ప్రశంసలు కూడా అందుకున్నారు. అటు కాస్ట్యూమ్ డిజైనర్ గా.. ఇటు నిర్మాత రాణిస్తూ తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటున్నారు.
తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న కుమార్తె సుస్మితకు మెమరబుల్ గిఫ్ట్ అందించారు మెగాస్టార్ చిరంజీవి. కాస్ట్యూమ్ డిజైనర్ గా.. నిర్మాత గుర్తింపు సంపాదించుకున్న తన కుమార్తెకు చిరు జగన్మాత దుర్గాదేవి విగ్రహాన్ని (స్మృతి చిహ్నం) బహుమతిగా అందించారు. ఇంత అద్భుతమైన కానుక ఇచ్చినందుకు తండ్రికి థాంక్స్ చెబుతూ మెగా డాటర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి.