సీఎం కేసీఆర్ నేడు తెలంగాణ సచివాలయాన్ని పరిశీలించనున్నారు. ఏప్రిల్ 14వ తేదిన సెక్రటేరియెట్ ను ప్రారంభించేందుకు ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో కేసీఆర్ సెక్రటేరియెట్ వద్ద పనులను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని .. సచివాలయంలో నిర్మించిన ఆయన విగ్రహాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది దళితబిడ్డలను హైద్రాబాద్ కు ఆహ్వనించి వారి సమక్షంలో ఆవిష్కరించాలని, ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు సచివాలయాన్ని సందర్శించనున్నారు.