బీజేపీ నాయకులు చేపట్టిన మహిళా గోస- బీజేపీ భరోసా దీక్ష ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు, ఆఘాయిత్యాలు, విచ్చలవిడిగా వెలిసిన బెల్టు షాపులపై బీజేపీ అగ్ర నేతలు దీక్ష చేపట్టారు. మహిళా నాయకులు డీకే అరుణ, విజయశాంతి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని మహిళా మోర్చా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. లిక్కర్ కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో బెల్టు షాపుల దందాపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.