AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రగ్స్ ముఠా ఘర్షణల్లో దారుణం.. 53 మంది మృతి, మరో 51 మంది మిస్సింగ్

మెక్సికోలోని సినాలోవాలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఘటనల్లో వంద మందికి పైగా మరణించారు. సెప్టెంబరు 9న సినలోవా కార్టెల్ ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో దాదాపు 53 మంది మరణించగా, మరో 51 మంది ఇతరులు తప్పిపోయారు. జులైలో ప్రారంభమైన ఈ భయంకరమైన హింస ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. సినాలోవా కార్టెల్ అనే మాదకద్రవ్యాల ముఠాలోని రెండు శక్తివంతమైన వర్గాల మధ్య ఈ వివాదం మొదలైంది.

అరెస్ట్ తర్వాత

వారి సమూహాలలో ఒకరైన ఇస్మాయిల్ “ఎల్ మాయో” జాంబాడా యునైటెడ్ స్టేట్స్‌లో అరెస్టయ్యాడు. 74 ఏళ్ల జాంబాడా, లాస్ చాపిటోస్ అనే మరో కార్టెల్ వర్గానికి చెందిన సీనియర్ సభ్యుడు తనను కిడ్నాప్ చేసి, ఆపై తన ఇష్టానికి విరుద్ధంగా అమెరికాకు తీసుకెళ్లాడని ఆరోపించాడు. ఆ క్రమంలో సెప్టెంబరు 9న కాల్పులు ప్రారంభమైనప్పటి నుంచి రాజధాని కులియాకాన్‌లో రోజు తుపాకీ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో పాఠశాలలతోపాటు రెస్టారెంట్లు, దుకాణాలు కూడా మూసివేయబడ్డాయి.

స్పందించిన నేతలు

ఈ ఘటనలపై సినాలోవా గవర్నర్ రూబెన్ రోచా మోయా స్పందించారు. గత కొన్ని రోజుల్లో 40 మందికి పైగా అరెస్టు చేశామని, సినాలోవాలో 5,000 కంటే ఎక్కువ మందికి ఆహార ప్యాకేజీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరోవైపు జాంబాడాను కిడ్నాప్ చేసిన స్మగ్లర్ జోక్విన్ గుజ్మాన్ లోపెజ్ మధ్య గతంలో లొంగిపోయే చర్చల గురించి మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రస్తావించారు. ఈ అస్థిరతకు యునైటెడ్ స్టేట్స్ పాక్షికంగా బాధ్యత వహిస్తుందని వ్యాఖ్యానించారు.

.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10