విజయవాడ వరదల్లో సీఎం చంద్రబాబు యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రికార్డు స్థాయిలో వర్షం పడటంతో బుడమేరులో 35వేల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తింది. బుడమేరు వరదకు ఇల్లీగల్ మైనింగే కారణం. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుంది’ అని హామీ ఇచ్చారు.