ఇటీవల కురిసిన భారీ వర్షాల దెబ్బకు తెలుగు రాష్ట్రాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాలలో వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ తక్షణం రూ. 5858. 60 కోట్లు విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ పండ్ అడ్వాన్స్ నుంచి దేశంలోని 14 రాష్ట్రాలకు హోం శాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ కు రూ. 1,036 కోట్లు, తెలంగాణకు రూ. 416. 80 కోట్ల వరదసాయం కింద నిధులు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించిన విషయం తెలిసిందే.
కేంద్ర బృందాలు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా నష్టాన్ని అంచనా వేసిన కేంద్ర హోంశాఖ తక్షణ సాయంగా ఈ నిధులు కేటాయించింది. కేంద్ర బృందాలు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు 14 రాష్ట్రాలకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని మంగళవారం కేంద్ర హోం శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు వరదల కారణంగా కొన్ని జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే.