AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చైతూ, శోభిత విడిపోవడం ఖాయం!.. మళ్లీ బాంబు పేల్చిన వేణు స్వామి

నెట్టింట హాట్‌హాట్‌ చర్చ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
నటుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాల విడిపోవడం ఖాయమంటూ జ్యోతిష్యుడు వేణు స్వామి హాట్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో నెట్టింట రచ్చ రచ్చ అవుతోంది. చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్‌ గురువారం జరిగిన విషయం విదితమే. ఎవరి నోటా విన్నా ఇప్పుడు ఈ జంట, సమంతల పేరే వినిపిస్తుండగా తాజాగా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంట్రీ ఇచ్చి ఈ ఎంగేజ్‌మెంట్‌ వార్తను మరింత ఆసక్తికరంగా మార్చాడు. అయితే శుక్రవారం ఉదయం ఆయన చెప్పినట్టుగానే ఇరువురి జాతకాలపై వీడియో రిలీజ్‌ చేశాడు. ఇందులో వారి జాతకం బాలేదంటూ కామెంట్స్‌ చేశాడు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని, 2027 వరకు బాగానే ఉన్నా ఈ మూడేళ్ల తర్వాత చైతూ, శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు, గొడవలు వస్తాయన్నాడు. అంతేకాక వీరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ముహుర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని, కచ్చితంగా విడిపోతారని వేణు స్వామి చెప్పాడు.

శోభిత జాతకంలో శని దృష్టి..
పైపెచ్చు వారు నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం ఎలాంటిదో గల్లీ జ్యోతిష్యుడు కూడా చెప్పగలడని వీరి నిశ్చితార్థం ఉత్తర నక్షత్రంలో జరిగిందన్నారు. నాగ చైతన్య రాశి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి అని అందులో నాగ చైతన్యకు 6, శోభితకు 8 పాయింట్లు వచ్చాయన్నారు. శోభిత జాతకంలో శని దృష్టి కుజుడితో పాటు శుక్రుడు, గురుడుల మీద ఉందన్నారు. ఇద్దరి జాతకాల్లో షష్టాకాలు వచ్చాయని అన్నాడు. నేను కావాలని, తెలియకుండా చెప్పడంలేదని నేను చెప్పిన జాతకం ఫెయిల్‌ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10